Traditional
Sarvaloka Smpujya Namo Namo
సర్వలోక సంపూజ్య నమో నమో
సర్వ జ్ఞాన సంపూర్ణ నమో నమో
సర్వ సత్య సారాంశ నమో నమో
దేవా గావో దేవా గావో

దీన భక్త మందార నమో నమో
దోష శక్తి సంహార నమో నమో
దేవా యేశావతారా నమో నమో
దేవా గావో దేవా గావో

దేవలోక ప్రదీప నమో నమో
భావలోక ప్రతాప నమో నమో
పావనాత్మ స్వరూప నమో నమో
దేవా గావో దేవా గావో

వేదవాక్య దర్సమీవె నమో నమో
వేద జీవ మార్గంబీవే నమో నమో
వేద వాక్కును నీవే నమో నమో
దేవా గావో దేవా గావో

శాప గ్రహివైతివి నాకై నమో నమో
ప్రాణత్యాగివైతివి నాకై నమో నమో
ప్రాయశ్చిత్తమైతివి నాకై నమో నమో
దేవా గావో దేవా గావో